Raviteja: ఏప్రిల్ 1న 'రావణాసుర' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. వేదిక ఎక్కడంటే..!

  • సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర'
  • నెగెటివ్ షేడ్స్ తో కనిపించనున్న రవితేజ 
  • ఆయన సరసన ఐదుగురు హీరోయిన్స్ సందడి 
  • ఏప్రిల్ 7వ తేదీన సినిమా విడుదల
Ravanasura Pre release event date confirmed

రవితేజ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రావణాసుర' రెడీ అవుతోంది. అభిషేక్ పిక్చర్స్ - రవితేజ కలిసి నిర్మించిన సినిమా ఇది. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. 

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి ముహూర్తాన్ని ఖాయం చేశారు. ఏప్రిల్ 1వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంటును, హైదరాబాదు .. హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. 

ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను చేస్తుండగా, ఆయన సరసన నాయికలుగా ఐదుగురు హీరోయిన్స్ కనిపించనుండటం విశేషం. రావు రమేశ్ .. సంపత్ రాజ్ .. మురళీ శర్మ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, హర్షవర్ధన్ రామేశ్వర్ - భీమ్స్ సంగీతాన్ని అందించారు.

More Telugu News