రామ్ గోపాల్ వర్మనే నా మొదటి ఆస్కార్: కీరవాణి
- 'క్షణక్షణం' చిత్రం ద్వారా ఆర్జీవీ తనకు అవకాశం ఇచ్చారన్న కీరవాణి
- ఆ తర్వాతే తనకు అవకాశాలు వచ్చాయని వెల్లడి
- వర్మతో పని చేయడం తన జీవితంలో కీలక మలుపు అని వ్యాఖ్య
'క్షణక్షణం' సినిమా టైమ్ కి తాను ఎవరికీ తెలియదని... కానీ వర్మ తనకు అవకాశం ఇవ్వగానే తనలో ఏదో ట్యాలెంట్ ఉందని అందరూ భావించారని కీరవాణి చెప్పారు. ఆ సినిమా హిట్ కావడంతో తనకు వరుస అవకాశాలు వచ్చాయని... వర్మతో పని చేయడం తన జీవితంలో కీలక మలుపు అని అన్నారు.
చనిపోయానని ఫీలవుతున్నా.. వర్మ!
మరోవైపు కీరవాణి వ్యాఖ్యలపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. కీరవాణి మాటలు వింటుంటే తాను చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోందని... ఎందుకంటే చనిపోయిన వారిపైనే ఇంత గొప్పగా ప్రశంసలు కురుస్తాయని సరదాగా వ్యాఖ్యానించారు.