ప్రేమ గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదా?: వర్మ

Ramgopal varma tweet on naveen murder case
  • నవీన్‌ హత్యకేసుపై ట్విట్టర్ లో స్పందించిన దర్శకుడు
  • హరిహరకృష్ణ, నిహారిక ఫొటోలతో ట్వీట్
  • వర్మ సినిమాలకు పర్ ఫెక్ట్ కథ అంటున్న నెటిజన్లు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా స్పందించారు. ఈ కేసును ప్రస్తావిస్తూ హతుడు, నిందితుల ఫొటోలతో తనదైన స్టయిల్ లో ట్వీట్ చేశారు. నవీన్, హరిహర, నిహారిక ఫొటోలను చూపిస్తూ.. నిహారిక కోసం హరిహరకృష్ణ తన స్నేహితుడు నవీన్ ను చంపేశాడని, ప్రేమ గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదా..? అని ప్రశ్నించారు. వర్మ ట్వీట్ పై నెటిజన్లు అదే స్టయిల్ లో స్పందిస్తున్నారు. మీ సినిమాలకు సరిగ్గా సరిపోయే కథ అని కొంతమంది కామెంట్ చేశారు.

నిహారికకు తనకు మధ్య అడ్డొస్తున్నాడనే కోపంతో హరిహరకృష్ణ తన స్నేహితుడు నవీన్ ను అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి విదితమే. ఆపై శరీరాన్ని చీల్చి, గుండె, మర్మాంగాలను కూడా కోసి బయటకు తీశాడు. డెడ్ బాడీ ఆనవాళ్లు గుర్తించకుండా మార్చేసేందుకు ప్రయత్నించాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ప్రస్తుతం ఈ కేసులో హరిహరకృష్ణతో పాటు అతడికి సాయం చేసిన నిహారిక, స్నేహితుడు హసన్ లను పోలీసులు జైలుకు పంపారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Ram Gopal Varma
Twitter
naveen murder
Niharika
hariharakrishna

More Telugu News