Jagan: విజయవాడలో ఓ పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్

CM Jagan attends a wedding reception in Vijayawada
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ ఇవాళ విజయవాడలో ఓ శుభకార్యానికి విచ్చేశారు. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సోదరుడు ముక్కాల వ్యాస్ ప్రసాద్ కుమార్తె వివాహం జరగ్గా, ఇవాళ విజయవాడలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్ వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి ఆశీస్సులు అందించారు. 

ఇక, వైసీపీ 12 వసంతాలు పూర్తి చేసుకుని, 13వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సీఎం జగన్ సోషల్ మీడియా ద్వారా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. 

"గత 12 ఏళ్లుగా నా ఈ ప్రయాణంలో నాతో నిలబడి వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ, మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను" అంటూ సందేశం వెలువరించారు.
Go Back to Shorts
Jagan
Wedding Reception
Vijayawada
YSRCP
Andhra Pradesh

More Telugu News