ఆమె కోసమే పేపర్ లీక్.. టీఎస్ పీఎస్ సీ పేపర్‌ లీక్‌లో కొత్త కోణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆమె కోసమే పేపర్ లీక్.. టీఎస్ పీఎస్ సీ పేపర్‌ లీక్‌లో కొత్త కోణం

Honeytrap For Praveen In TSPSC Paper Leak Case
  • యువతి వలపు వలలో చిక్కుకున్న ఉద్యోగి
  • ఆమె అడగడంతో టౌన్ ప్లానింగ్ పరీక్ష పేపర్ లీక్
  • అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్నపోలీసులు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) పేపర్ లీక్ వ్యవహారంలో కొత్త కోణం బయటపడింది. కమిషన్ ఉద్యోగి ప్రవీణ్ పై ఓ యువతి వలపు వల విసిరిందని, ఈ ట్రాప్ లో చిక్కుకున్న ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు ప్రచారం జరిగినట్లు కంప్యూటర్ హ్యాక్ కాలేదని స్పష్టం చేశారు.

పేపర్ లీకేజీ ఆరోపణలతో దర్యాప్తు చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు టీఎస్ పీఎస్ సీ ఆఫీసుకు వచ్చిపోయే వారి వివరాలను పరిశీలించారు. రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలలో వెతికారు. దీంతో కొంతకాలంగా ఓ యువతి తరచుగా ఆఫీసుకు వస్తోందని గుర్తించారు. ఆమె తరచూ ప్రవీణ్ ను కలుస్తోందని తేలింది.

టీఎస్ పీఎస్ సీ సెక్రెటరీ పీఏగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ తో సన్నిహితంగా మెలుగుతూ టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ పేపర్ ఇవ్వాలని అడిగింది. ఆమె కోసం ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్టు గుర్తించారు. నిందితుడు ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
tspsc
paper leak
honey trap
praveen

More Telugu News