America: 13 ఏళ్ల బాలుడితో 31 ఏళ్ల మహిళ శారీరక బంధం.. పుట్టబోయే బిడ్డకు బాలుడే తండ్రన్న కోర్టు!

Woman Pregnant with 13 year old boy court said boy will be the father of cild
  • అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో ఘటన
  • బాలుడి కారణంగా గర్భం దాల్చిన మహిళ
  • మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
  • మహిళ ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకుని బెయిలు
  • ఇరు పక్షాల మధ్య రాజీ కుదరడంతో కేసు కొట్టివేత
పక్కింట్లో ఉండే 13 ఏళ్ల బాలుడితో పరిచయం పెంచుకుని ఆపై శారీరక సంబంధం ఏర్పరచుకుందో మహిళ. ఇప్పుడామె గర్భవతి కావడంతో విషయం కోర్టుకు చేరింది. ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వాలో తెలియక న్యాయమూర్తులు తలలు పట్టుకున్నారు. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో జరిగిందీ ఘటన. 

పొరిగింటి బాలుడితో పరిచయం పెంచుకుని శారీరక సంబంధం పెట్టుకున్న ఆండ్రియా సెరానో వయసు 31 సంవత్సరాలు. బాలుడిని ఇంటికి పిలిపించుకునే ఆమె విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని కోరింది. వయసులో ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉండడంతో ఎవరూ అనుమానించలేదు కూడా. అయితే, ఆమె గర్భం దాల్చడంతో విషయం బయటపడింది. మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపిస్తూ పోలీసులు ఆండ్రియాను అరెస్టు చేశారు. తమ మధ్య లైంగిక పరమైన సంబంధం నిజమేనని విచారణలో ఆండ్రియా అంగీకరించింది. అంతేకాదు, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు బాలుడే తండ్రి అని చెప్పింది. 

తలలు పట్టుకున్న న్యాయమూర్తులు
మహిళ చెప్పింది విని న్యాయమూర్తులు విస్తుపోయారు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. మరోవైపు, ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 70 వేల డాలర్ల (రూ. 57 లక్షలు) పూచీకత్తుతో బెయిలు మంజూరు చేశారు. ఆ తర్వాత ఇరు పక్షాల మధ్య రాజీ కుదరడంతో కేసును ముగించాలని కోర్టు నిర్ణయించింది. అయితే, పుట్టబోయే బిడ్డకు మాత్రం బాలుడినే తండ్రిగా పరిగణించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
America
Colorado
Colorado Court
USA

More Telugu News