బ్యాంకులు ఇకపై వారంలో ఐదు రోజులే?
- వారానికి ఐదుల రోజు పని విధానం కోరిన ఉద్యోగుల ఫోరమ్
- వారి డిమాండ్ ను పరిశీలిస్తామన్న బ్యాంక్స్ అసోసియేషన్
- కొత్త నిబంధన అమల్లోకి వస్తే పెరగనున్న పని వేళలు
ప్రస్తుతం రెండో, నాలుగో శనివారాలు మినహాస్తే వారికి ఆరు రోజులు పని చేస్తున్నారు. అయితే, కొత్త విధానం అమల్లోకి వస్తే ఇకపై అన్ని శనివారాలు బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ విధానం అమలు చేయాలంటే పని వేళలు పెంచాల్సి ఉంటుంది. వారంలో ఐదు పని దినాల్లో రోజుకు 40 నిమిషాల పాటు పని వేళలు పెంచాలి. ప్రతి రోజూ ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనివేళలు ఉండే అవకాశం ఉంటుంది.