50 రోజులను పూర్తిచేసుకున్న 'వీరసింహా రెడ్డి'
- బాలయ్య మాస్ డైలాగ్స్ కు, మాస్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా
- బలమైన కంటెంట్ తో మెప్పించిన దర్శకుడు
- వరలక్ష్మి శరత్ కుమార్ నటన హైలైట్
- హనీ రోజ్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ
అలాంటి ఈ సినిమా ఈ రోజుతో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఇంకా కొన్ని సెంటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతూనే ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. 'వీరసింహారెడ్డి' తరువాత చాలా సినిమాలు థియేటర్లకు వచ్చాయి. అయినా ఆ పోటీని తట్టుకుంటూ ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం.
ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. గోపీచంద్ మలినేని టేకింగ్ .. బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ .. మాస్ స్టెప్పులు .. వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ .. హనీ రోజ్ గ్లామర్ ఈ సినిమా హైలైట్స్ గా నిలిచాయి. ఈ సినిమా విజయం ప్రధానమైన పాత్రను పోషించాయి.