'నేను స్టూడెంట్ సర్' రిలీజ్ డేట్ వాయిదా!
- బెల్లంకొండ గణేశ్ హీరోగా 'నేను స్టూడెంట్ సర్'
- కథానాయికగా అవంతిక పరిచయం
- సంగీతాన్ని అందించిన మహతి స్వరసాగర్
- మార్చి 10వ తేదీ నుంచి వాయిదా పడిన సినిమా
ఈ సినిమాను మార్చి 10వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వాయిదా వేశారు. ఎగ్జామ్స్ కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ ను పరీక్షల తరువాత ప్రకటించనున్నారు.
ఈ సినిమాతో భాగ్యశ్రీ కూతురు 'అవంతిక' కథానాయికగా పరిచయం కానుంది. ఈ సినిమా కోసం మహతి స్వరసాగర్ స్వరపరిచిన పాటలు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. సముద్రఖని .. సునీల్ .. శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.