రవితేజ 'రావణాసుర' నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్!
- సుధీర్ వర్మ దర్శకుడిగా 'రావణాసుర'
- రవితేజ సరసన ఐదుగురు భామలు
- ఈ నెల 18వ తేదీన పూర్తి పాట
- ప్రత్యేక ఆకర్షణగా భారీ తారాగణం
- ఏప్రిల్ 7వ తేదీన సినిమా రిలీజ్
ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను వదిలారు. 'నేను ప్యార్ లోన పాగలే .. లోకల్ బాబా సెహగలే, నీకు పెళ్లి పీటలే .. నాకేమో బ్రేకప్ పాటలే' అంటూ ఈ పాట సాగుతోంది. పూర్తి పాటను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.
భారీతారాగణం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తోంది. మేఘ ఆకాశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ .. ఫరియా అబ్దుల్లా .. దక్ష నగార్కర్ .. రావు రమేశ్ .. మురళీ శర్మ .. సంపత్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.