బెంగళూరులో ఎయిర్ షోలో అమెరికా కొత్త యుద్ధ విమానాలు
- బెంగళూరు చేరుకున్న ఎఫ్-35ఏ పోరాట విమానాలు
- ఈ రెండు విమానాలు ఐదో తరానికి చెందిన జెట్ ఫైటర్లు
- ఎయిర్ షోలో తమ విన్యాసాలతో ఆకట్టుకున్న వైనం
- అమెరికా విమానాల్లో అత్యంత అధునాతన టెక్నాలజీ
ఐదో తరానికి చెందిన ఈ రెండు అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఒకటి ఎఫ్-35ఏ లైట్నింగ్-II కాగా, మరొకటి ఎఫ్-35ఏ జాయింట్ స్ట్రైక్ ఫైటర్. ఈ అత్యాధునిక జెట్ ఫైటర్లలో స్టెల్త్ పరిజ్ఞానంతో పాటు సూపర్ సోనిక్ వేగం కూడా ఉంది. ఇవాళ బెంగళూరు ఎయిర్ షోలో రెండు అమెరికా యుద్ధ విమానాల వాయు విహారం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఎఫ్-35ఏ జాయింట్ స్ట్రైక్ ఫైటర్ ఉటాలోని హిల్ ఎయిర్ ఫోర్స్ స్థావరం నుంచి ఇక్కడికి రాగా, ఎఫ్-35ఏ లైట్నింగ్-II అలాస్కాలోని ఈల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు చెందిన 354వ ఫైటర్ వింగ్ నుంచి వచ్చింది.
గత కొన్ని సంవత్సరాలుగా భారత్, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. అమెరికా నూతనంగా అభివృద్ధి చేసిన ఈ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ యుద్ధ విమానాలను ప్రదర్శించేందుకు భారత్ ను వేదికగా ఎంచుకోవడం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలకు నిదర్శనం.