రిషభ్ పంత్ కోసం ఉజ్జయిని ఆలయంలో టీమిండియా క్రికెటర్ల పూజలు
- మహాకాళేశ్వర్ ఆలయంలో సూర్య, కుల్ దీప్, సుందర్ పూజలు
- శివుడికి భస్మ హారతిని సమర్పించిన క్రికెటర్లు
- రిషభ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించామన్న సూర్య
స్వామివారి దర్శనానంతరం సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ, రిషభ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించామని చెప్పారు. రిషభ్ జట్టులోకి రావడం చాలా అవసరమని అన్నాడు. మరోవైపు, భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చివరి వన్డే జరగబోతోంది. మూడు వన్డేలా ఈ సిరీస్ లో ఇండియా ఇప్పటికే 2-0 ఆధిక్యతలో ఉంది.