K Sasikanth: మరో ప్రాజెక్టుకు సిద్ధమవుతున్న 'టాప్ గేర్' దర్శకుడు కె. శశికాంత్

Top Gear director set to take up another project
  • ఆది సాయికుమార్ హీరోగా టాప్ గేర్
  • కె.శశికాంత్ దర్శకత్వంలో చిత్రం
  • టాప్ గేర్ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు
  • తదుపరి ప్రాజెక్టుకు సిద్ధమవుతున్న కె.శశికాంత్
నేటితరం ఆడియన్స్ డిఫరెంట్ పాయింట్‌తో తెరకెక్కే సినిమాలను ఆదరిస్తూ గొప్ప విజయం అందిస్తున్నారు. ప్రేక్షకులు కోరుకుంటున్న ఇదే బాటలో వెళుతూ నూతన దర్శకులు సైతం వినూత్నమైన కథా కథనాలతో ఆడియన్స్‌కి చేరువవుతున్నారు. అలాంటి దర్శకుల్లో కె. శశికాంత్ ఒకరు. 

ఇటీవల ఆది సాయికుమార్ హీరోగా టాప్ గేర్ సినిమా తెరకెక్కించి తన టాలెంట్ ను చాటుకున్నారు. ఓ క్యాబ్ డ్రైవర్ నేపథ్యంలో తొలి సినిమాను రూపొందించిన కె. శశికాంత్ అందరినీ ఆకట్టుకున్నారు. టాప్ గేర్ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కడమే గాక ప్రేక్షకులకు వినూత్న అనుభూతి కలిగించింది. 

త్వరలోనే ఈ టాప్ గేర్ సినిమాను ప్రముఖ ఓటీటీ వేదికపై రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు కె.శశికాంత్ ప్రస్తుతం తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు. ప్రముఖ హీరోతో ఆయన తదుపరి చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు నడుస్తున్నాయి. టాప్ గేర్ లాగే మరో డిఫరెంట్ పాయింట్ తీసుకొని స్టోరీ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.

More Telugu News

K Sasikanth
Director
Top Gear
Adi Saikumar