బీజేపీ అధ్యక్షుడు నడ్డా పదవీకాలం పొడిగింపు 
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ అధ్యక్షుడు నడ్డా పదవీకాలం పొడిగింపు 

JP Nadda gets extension
  • 2024 జూన్ వరకు నడ్డా పదవీకాలం కొనసాగింపు
  • ఈ ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం
  • నడ్డా నాయకత్వంలో మంచి విజయాలను సాధించామన్న అమిత్ షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు. 2024 జూన్ వరకు పార్టీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలాన్ని పొడిగిస్తూ ఈరోజు జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది అత్యంత ముఖ్యమైన లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నడ్డాను కొనసాగించాలని జాతీయ కార్యవర్గం నిర్ణయించింది.

 ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ... నడ్డా అధ్యక్షతన 2024 లోక్ సభ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. నడ్డా నాయకత్వంలో మంచి విజయాలను సాధించామని... తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతమయిందని అన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే శక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉందని చెప్పారు.
Advertisement
JP Nadda
Amit Shah
BJP

More Telugu News