Chiranjeevi: మిలియన్ల కొద్దీ వ్యూస్ ను కొల్లగొడుతున్న 'వాల్తేరు వీరయ్య' సాంగ్!

  • మాస్ యాక్షన్ మూవీగా 'వాల్తేరు వీరయ్య'
  • దేవిశ్రీ పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ 
  • మార్కులు కొట్టేస్తున్న 'నీకేమో అందమెక్కువ' సాంగ్ 
  • ఈ నెల 13వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా
Waltair Veerayya movie update

చిరంజీవి - బాబీ కాంబినేషన్లో 'వాల్తేరు వీరయ్య' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు.

'నీకేమో అందమెక్కువ .. నాకేమో తొందరెక్కువ' అంటూ ఈ పాట సాగుతోంది. చిరంజీవి - శ్రుతిహాసన్ జంటగా నటించిన ఈ పాటను విదేశాల్లో చిత్రీకరించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. మీకా సింగ్ .. గీతామాధురి .. వేల్ మురుగన్ ఈ పాటను ఆలపించారు.

ఈ పాట మిగతా పాటలను మించి ఉంటుందని చిరంజీవి చెప్పడం వలన, అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్టుగానే కొన్ని గంటల్లోనే ఈ పాటకి 3.4 మిలియన్ వ్యూస్ లభించాయి. అంతే ఫాస్టుగా ఈ పాట దూసుకుపోతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

More Telugu News