Waltair Veerayya: విశాఖలో ప్రారంభమైన 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్

Waltair Veerayya pre release event starts in Visakha
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి హీరో కొత్త చిత్రం వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టయినర్ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రీ రీలీజ్ వేడుకను చిత్రబృందం విశాఖలో ఏర్పాటు చేసింది. 

తొలుత ఈ కార్యక్రమాన్ని విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించాలని భావించినా పోలీసుల అనుమతి రాలేదు. దాంతో వేదికను ఏయూ ఇంజినీరింగ్ కాలేజి మైదానానికి మార్చారు. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో ఏయూ మైదానం జనసంద్రంలా మారింది. ఈ ఈవెంట్ కు మెగా ఫ్యాన్స్ పోటెత్తారు.
Go Back to Shorts
Waltair Veerayya
Pre Release Event
Visakhapatnam
Chiranjeevi
Bobby
Mythri Movie Makers

More Telugu News