అమెరికాలో జోరుగా ‘వాల్తేరు వీరయ్య’ టికెట్ల బుకింగ్

అమెరికాలో జోరుగా ‘వాల్తేరు వీరయ్య’ టికెట్ల బుకింగ్

WaltairVeerayya Advance Pre  Sales in USA
  • ఈ నెల 12న ప్రీమియర్స్ కు టికెట్ల విక్రయం ప్రారంభం
  • ఇప్పటికే రూ. 80 లక్షలకు పైగా విలువైన టికెట్లు బుక్
  • మెగాస్టార్ చిరు సినిమాపై భారీ అంచనాలు
మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కోసం ఆయన అభిమానులే కాకుండా తెలుగు ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ పూర్తి మాస్ పాత్రలో కనిపించబోతున్న చిత్రం ఇది. బాబీ (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. చిరంజీవి సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. రవితేజ కీలక పాత్ర పోషించాడు. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టీజర్, పాటల విశేష స్పందన వచ్చింది. అవి సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. 

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా.. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ లో ఆత్రుత పెరిగింది. అమెరికాలో ఈ చిత్రం ఓ రోజు ముందే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 12వ తేదీన యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శించనుంది చిత్ర బృందం. ఇందుకోసం టికెట్లను అందుబాటులో ఉంచింది. అమెరికాలో శ్లోకా ఎంటర్ టైన్మెంట్ చిత్రాన్ని విడుదల చేస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ను చూసేందుకు భారీ స్థాయిలో అడ్వాన్స్ డ్ బుకింగ్స్ వస్తున్నాయని చిత్ర బృందం తెలింపింది. ఇప్పటికే దాదాపు 80 లక్షల రూపాయల విలువ చేసే టికెట్లను బుక్ చేసుకున్నట్టు ప్రకటించింది. రిలీజ్ టైమ్ నాటికి ఇది చాలా రెట్లు పెరిగే అవకాశం ఉంది.
Advertisement
Chiranjeevi
WaltairVeerayya
usa
tickets
sales
bookings

More Telugu News