Waltair Veerayya: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న 'వాల్తేరు వీరయ్య'

  • చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య
  • బాబీ దర్శకత్వంలో చిత్రం
  • U/A సర్టిఫికెట్ కేటాయించిన సెన్సార్ బోర్డు
  • జనవరి 13న రిలీజ్
Waltair Veerayya completes censor works

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో బాబీ దర్శకత్వంలో వస్తున్న మాస్ ఎంటర్టయినర్ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. వాల్తేరు వీరయ్య చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ కేటాయించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. వాల్తేరు వీరయ్య సంక్రాంతికి రఫ్ ఆడించేస్తాడు అంటూ పేర్కొంది. 

ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ కాగా, రవితేజ, కేథరిన్ ట్రెసా కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News