మాకు విశాఖను ఇచ్చేస్తే ఓ చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటాం: ఏపీ మంత్రి ధర్మాన
- ఉత్తరాంధ్రలో తిరుగుతూ కూడా చంద్రబాబు అమరావతే రాజధాని అంటున్నాడని ధర్మాన విమర్శ
- మన చేతులతో మన కళ్లనే పొడిచే ప్రయత్నం అంటూ వ్యాఖ్యలు
- సైకిల్ ను నమ్మి మోసపోవద్దన్న మంత్రి ధర్మాన
ఈ సందర్భంగా ధర్మాన... చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు అధికారమే పరమావధి అని, ప్రజల్లో ఏ మూలో సైకిల్ భావన ఉందని, సైకిల్ ను నమ్మి మోసపోవద్దని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న ప్రజాసంక్షేమాన్ని చూడలేకే చంద్రబాబు బాదుడే బాదుడు అంటూ తిరుగుతున్నాడని విమర్శించారు.