Chiranjeevi: సంక్రాంతి బరిలో ఒక రేంజ్ లో జరగనున్న స్టార్ వార్!

  • సంక్రాంతి బరిలో భారీ మాస్ యాక్షన్ సినిమాలు
  • జనవరి 12న రానున్న 'వీరసింహా రెడ్డి'
  • అదే రోజున విడుదల కానున్న 'వారసుడు'
  • ఒక రోజు ముందుగానే పలకరించనున్న 'తెగింపు' 
  • జనవరి 13న వస్తున్న 'వాల్తేరు వీరయ్య'
Snakranthi Movies Special

సాధారణంగా సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సందడి ఎక్కువగానే ఉంటుంది. సంక్రాంతి రోజుల్లో ఎన్ని సినిమాలు వచ్చినా, వసూళ్ల విషయంలో బెంగపెట్టుకోవలసిన అవసరం లేదనే టాక్ వుంది. అయితే ఒకరిద్దరు పెద్ద హీరోలు .. ఆ తరువాత వరుసలో హీరోలు పోటీపడుతుండటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సంక్రాంతికి మాత్రం ఒక చిత్రమైన పోటీ అందరిలో మరింత కుతూహలాన్ని పెంచుతోంది. చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో నాయికగా శ్రుతి హాసన్ అందాల సందడి చేయనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక సంక్రాంతి సెంటిమెంటును బలంగా నమ్మే బాలకృష్ణ, ఒకరోజు ముందుగానే 'వీరసింహారెడ్డి'ని బరిలోకి దింపుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలోని ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ ఇద్దరు సీనియర్ స్టార్ లు ఒకరోజు తేడాతో సంక్రాంతి బరిలో దిగుతుండటం ఈ మధ్య కాలంలో జరగలేదనే చెప్పాలి. ఇదే నేపథ్యంలో కోలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన విజయ్ - అజిత్ కూడా సంక్రాంతికి పండగకే రానున్నారు. అజిత్ హీరోగా చేసిన 'తెగింపు' జనవరి 11న వస్తుంటే, విజయ్ 'వారసుడు' 12న పలకరించనుంది. ఈ నలుగురు స్టార్స్ కి మాస్ ఇమేజ్ పుష్కలంగా ఉండటం కూడా అందరిలో ఆసక్తిని రేకెతించడానికి కారణమవుతోంది.

More Telugu News