‘రాజా డీలక్స్’లో ప్రభాస్ లుక్ లీక్.. సూపర్ గా ఉందంటున్న ఫ్యాన్స్
- మారుతి దర్శకత్వంలో నటిస్తున్న రెబల్ స్టార్
- సెట్ లో తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్
- 2024లో విడుదల కానున్న చిత్రం
ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ తాజాగా లీక్ అయింది. షూటింగ్ లొకేషన్ లో తీసిన ఫొటో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రభాస్ ఒత్తయిన గడ్డం, కొంచెం పొడవైన హెయిర్ స్టయిల్ తో సూపర్ గా కనిపిస్తున్నాడని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. రాధేశ్యామ్ లో ప్రభాస్ లుక్ పై విమర్శలు వచ్చాయి. గడ్డం, మీసాలు లేకుండా రెబల్ స్టార్ అస్సలు బాగాలేడని అభిమానులు పెదవి విరిచారు. ఇప్పుడు సలార్ తో పాటు రాజా డీలక్స్ లో ప్రభాస్ లుక్ బాగుందని అంటున్నారు. రాజా డీలక్స్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్ పాత్రలను పోషిస్తున్నారు. 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.