జీతాలు ఆలస్యం కావడానికి కారణం ఇదే: హరీశ్ రావు
- కేంద్రం వల్లే జీతాలు ఆలస్యమవుతున్నాయన్న మంత్రి
- సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ
- దేశంలో ఎక్కువ వేతనాలు అందుకుంటున్నది తెలంగాణ ఉపాధ్యాయులేనని వెల్లడి
రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోందని మంత్రి విమర్శించారు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పెడుతోందని అన్నారు. 15వ ఆర్థిక సంఘం చెప్పిన రూ. 5 వేల కోట్లను కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని చెప్పారు. దేశంలోనే ఎక్కువ వేతనాలు అందుకుంటున్నది తెలంగాణ ఉపాధ్యాయులని... వారి జీతాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హరీశ్ రావు అన్నారు.