మరోసారి జోరు చూపించిన 'వీరసింహా రెడ్డి' .. 'మా బావ మనోభావాలు..' సాంగ్ రిలీజ్
Add ap7am to your home Screen

మరోసారి జోరు చూపించిన 'వీరసింహా రెడ్డి' .. 'మా బావ మనోభావాలు..' సాంగ్ రిలీజ్

Veera Simha Reddy lyrical song released
  • 'వీరసింహా రెడ్డి'గా పవర్ఫుల్ పాత్రలో బాలకృష్ణ 
  • ఆయన జోడీగా అందాల సందడి చేయనున్న శ్రుతి హాసన్
  • రీసెంట్ గా వదిలిన పాటతో హుషారెత్తించిన తమన్ 
  • జనవరి 12వ తేదీన విడుదలవుతున్న సినిమా   
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలోని సినిమాలపై బాలయ్య మార్కును ఎక్కువమంది ఇష్టపడతారు. ఆ తరహా కథల్లో ఆయనకి బ్లాక్ బస్టర్ హిట్లు తెచ్చిపెట్టిన సినిమాలే ఎక్కువ. ఈ జోనర్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన బాలయ్య, మళ్లీ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహా రెడ్డి' సినిమా చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'సుగుణ సుందరి' అనే సాంగుని వదిలారు. బాలయ్య - శ్రుతిహాసన్ కాంబినేషన్లో చిత్రీకరించిన ఈ పాటకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. బీట్ పరంగా .. కొరియోగ్రఫీ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. 

ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 'మా బావ మనోభావాలు' అనే సాంగును వదిలారు. హైదరాబాద్ .. ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని 'సంధ్య 35 MM'లో నిర్వహించిన ఈవెంట్ ద్వారా ఈ  సాంగును రిలీజ్ చేశారు. 'చుడీదారు ఇష్టమంట ఆడికీ .. వద్దొద్దన్న ఎండలకాలం ఏడీకి' అంటూ ఈ పాట మొదలవుతోంది. 

బాలకృష్ణ .. చంద్రిక రవి .. హనీరోజ్ బృందంపై ఈ పాటను కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను. సాహితి చాగంటి  .. యామిని .. రేణు కుమార్ ఆలపించారు. జానపద బాణీలో ఈ పాట హుషారుగా సాగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
Advertisement
Balakrishna
Sruthi Hasan
Gopichand Malineni
Veerasimha Redddy Movie

More Telugu News