మళ్లీ పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్
- 2015లో రెహామ్ ఖాన్ ను పెళ్లాడిన ఇమ్రాన్ ఖాన్
- అదే ఏడాది విడాకులు
- తాజాగా ఓ నటుడ్ని పెళ్లాడిన రెహామ్ ఖాన్
కాగా, నటుడు మీర్జా బిలాల్ బేగ్ రెహామ్ ఖాన్ కంటే 13 ఏళ్లు చిన్నవాడు. అయితే, రెహామ్ ఖాన్ కు ఇది మూడో పెళ్లి కాగా, బిలాల్ బేగ్ కు కూడా ఇది మూడో పెళ్లే. రెహామ్ ఖాన్.... తొలుత 1993లో ఇజాజ్ రెహ్మాన్ ను పెళ్లాడి 2005లో విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత 2015లో ఇమ్రాన్ ఖాన్ ను పెళ్లాడారు. అదే ఏడాది విడిపోయి సంచలనం సృష్టించారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.