మాచర్లలో పిన్నెల్లిని ఓడించే శక్తి చంద్రబాబుకు గానీ, బ్రహ్మారెడ్డికి గానీ లేదు: మంత్రి అంబటి

మాచర్లలో పిన్నెల్లిని ఓడించే శక్తి చంద్రబాబుకు గానీ, బ్రహ్మారెడ్డికి గానీ లేదు: మంత్రి అంబటి

Ambati Rambabu reacts on Macherla situation
  • మాచర్లలో టీడీపీ, వైసీపీ మధ్య ఉద్రిక్తతలు
  • చంద్రబాబు హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న అంబటి
  • అందుకే బ్రహ్మారెడ్డిని ఇన్చార్జిగా పెట్టారని విమర్శలు
  • బ్రహ్మారెడ్డి నేర చరిత్ర ప్రజలకు తెలుసని వ్యాఖ్య  
పల్నాడు జిల్లా మాచర్లలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు టీడీపీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ నేర చరిత్ర ఉన్న బ్రహ్మారెడ్డిని మాచర్ల టీడీపీ ఇన్చార్జిగా నియమించడం ద్వారా చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. 

మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించే శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకు గానీ, ఆయన ఇన్చార్జిగా పెట్టిన బ్రహ్మారెడ్డికి గానీ లేవని అంబటి స్పష్టం చేశారు. అందుకే పిన్నెల్లిని, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలను అంతమొందించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. 

తాను కన్నెర్ర చేస్తే పల్నాడులో ఒక్కరూ ఉండరు అని చంద్రబాబు పల్నాడులో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడింది నిజం కాదా? అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడిన ఆ వీడియోలు యూట్యూబ్ లో ఇప్పటికీ ఉన్నాయని తెలిపారు. 

బ్రహ్మారెడ్డి నేర చరిత్ర ఏమిటో, అతడు ఎన్ని హత్యలు చేశాడో మాచర్ల ప్రజలకు తెలుసని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, హత్యా రాజకీయాలు చేసినా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కాలి గోరు కూడా పీకలేరని అంబటి స్పష్టం చేశారు.
Advertisement
Ambati Rambabu
Pinnelli Ramakrishna Reddy
Chandrababu
Brahmareddy
Macherla
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News