నేనెక్కడికి వెళ్లినా భారతదేశాన్ని నా వెంటే తీసుకెళ్తా.. అది నాలో ఓ భాగం: సుందర్ పిచాయ్
- 2022 ఏడాదికి గానూ సుందర్ కు పద్మ భూషణ్ ప్రకటించిన భారత్
- తాజాగా ఈ పురస్కారాన్ని సుందర్ కు అందించిన భారత రాయబారి
- భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన గూగుల్ సీఈవో
శాన్ ఫ్రాన్సిస్కో లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు ఈ అవార్డును సుందర్ పిచాయ్ కి అందజేశారు. భారత దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ ను తనకు అందించడంపై సుందర్ పిచాయ్ భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులను, తన ఎదుగుదలకు సహాయపడిన వారిని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ కూడా పాల్గొన్నారు.