Sathyadev: తెలుగు తెరకి మరో కన్నడ బ్యూటీ!

  • 2013లో కన్నడ సినిమాతో కావ్య ఎంట్రీ 
  • తమిళ .. మలయాళ సినిమాలతోను గుర్తింపు 
  • 'గుర్తుందా శీతాకాలం'తో టాలీవుడ్ కి పరిచయం 
  • డిసెంబర్ 9వ తేదీన విడుదలవుతున్న సినిమా
Gurthunda Seetakalam Heroine Kavya Special

టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో కన్నడ బ్యూటీల రాక ఎక్కువవుతోంది. తాజాగా కన్నడ నుంచి మరో సుందరి తెలుగు తెరకి పరిచయమవుతోంది .. ఆ సుందరి పేరే 'కావ్య శెట్టి'. మంగళూరులో పుట్టి పెరిగిన కావ్య, 2013లోనే కన్నడ సినిమా ద్వారా పరిచయమైంది. ఆ వెంటనే పెద్దగా గ్యాప్ లేకుండా కోలీవుడ్ లో కాలు పెట్టింది.ఇక ఈ మధ్యనే మలయాళంలో కూడా ఎంట్రీ ఇచ్చిన కావ్య, 'గుర్తుందా శీతాకాలం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాలో తమన్నా .. మేఘ ఆకాశ్ తో పాటు మూడో హీరోయిన్ గా కావ్య శెట్టి కనిపించనుంది. డిసెంబర్ 9వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. 

ఈ సినిమాలో తన పాత్రను చూసి అంతా తిట్టుకుంటారనీ, అదే జరిగితే మాత్రం తాను ఆ పాత్రకి న్యాయం చేసినట్టేనని కావ్య చెబుతోంది. భవాని రవి - రామారావు నిర్మించిన ఈ సినిమాలో, సత్యదేవ్ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. కీలకమైన పాత్రలో సుహాసిని కనిపించనుంది.

More Telugu News