56 ఏళ్ల వయసులో చీరకట్టుతో మహిళ వ్యాయామం!
- ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నానంటున్న మహిళ
- చెన్నైలోని జిమ్ లో రోజూ వ్యాయామం చేస్తానని వెల్లడి
- ఇన్ స్టాలో వైరల్ గా మారిన వీడియో
చెన్నై లోనే తన కొడుకుకు ఓ జిమ్ ఉంది.. కోడలుతో కలిసి రోజూ వెళ్లడం ప్రారంభించారా మహిళ. చీరతోనే వెళ్ళి బరువులు ఎత్తుతూ ఆమె అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నాలుగేళ్ల క్రితం.. అంటే తన 52వ ఏట వ్యాయామం మొదలుపెట్టానని, ఇప్పుడు ఆరోగ్యంగా చురుకుగా ఉన్నానని వివరించారు. సదరు మహిళ జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేస్తూ.. ఆమె వయసు 56 ఏళ్లు.. జిమ్ కు చీరలో వస్తారు.. అయితేనేం, వ్యాయామం చేయకుండా ఆవిడను ఏదీ ఆపలేదని హ్యూమన్స్ ఆఫ్ మద్రాస్, మద్రాస్ బార్బెల్ కామెంట్ చేశాయి.
https://www.instagram.com/reel/Ck3NWmrKEvW/?utm_source=ig_embed&utm_campaign=loading