బన్నీ చీఫ్ గెస్టుగా 'ఊర్వశివో రాక్షసివో' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బన్నీ చీఫ్ గెస్టుగా 'ఊర్వశివో రాక్షసివో' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్!

Urvasivo Rakshasivo Blackbuster Celebrations
  • అల్లు శిరీష్ హీరోగా వచ్చిన 'ఊర్వశివో రాక్షసివో'
  • తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 
  • రేపు జరగనున్న బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ 
  • వీకెండులో వసూళ్లు పెరిగే ఛాన్స్  
అల్లు శిరీష్ - అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, అచ్చు రాజమణి సంగీతాన్ని సమకూర్చాడు. 'మాయారే' పాటను మాత్రం అనూప్ రూబెన్స్ స్వరపరిచాడు. రొమాంటిక్ కామెడీ జోనర్లో ఈ సినిమా తెరకెక్కింది. విరుద్ధమైన స్వభావాలు కలిగిన హీరో .. హీరోయిన్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. 

ప్రేమిస్తున్నానంటూ వెంటపడే హీరో .. పెళ్లికి మాత్రం నో అంటూనే అతనితో రొమాన్స్ చేసే హీరోయిన్. ఆ ఇద్దరి రొమాన్స్ కి కామెడీ టచ్ ఇచ్చే సునీల్ .. వెన్నెల కిశోర్ .. పోసాని పాత్రలు. ఇక ఆమని వైపు నుంచి అమ్మ ఎమోషన్ .. ఇలా కథ అని వైపులా నుంచి ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టయిన్ మెంట్ ను అందించడంతో, హిట్ టాక్ తెచ్చుకుంది. యూత్ ఫుల్ ఎంటర్టయినర్ గా నిలిచింది.  

 ఈ నేపథ్యంలో ఈ సినిమా 'యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్' ఈ నెల 6వ తేదీన (ఆదివారం) నిర్వహిస్తున్నారు. బన్నీ ముఖ్య అతిథిగా వస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకు జేఆర్సీ కన్వెన్షన్ వేదిక కానున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ వారం విడుదలైన ఇతర సినిమాలు డీలాపడిపోవడంతో, ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Allu Sirish
Anu Emmanuel
Amani
Urvasivo Rakshasivo Movie

More Telugu News