Nikesha Patel: విదేశీయుడిని పెళ్లాడబోతున్న హీరోయిన్ నిఖీషా పటేల్.. కాబోయే భర్త ఫొటో ఇదిగో!

Actress Nikesha Patel to marry foreign boy friend
  • 'కొమురం పులి' సినిమాలో పవన్ సరసన నటించిన నిఖీషా
  • త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడి
  • ప్రియుడితో ఉన్న ఫొటోను షేర్ చేసిన వైనం

నిఖీషా పటేల్... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోయిన్ అంటే అందరికీ బాగా గుర్తొస్తుంది. 2010లో వచ్చిన 'కొమురం పులి' చిత్రంలో పవన్ సరసన నటించింది. తన అందచందాలతో ప్రేక్షకులను నిఖీషా ఆకట్టుకుంది. అయితే, 'కొమురం పులి' తర్వాత ఆమెకు తెలుగులో ఆశించిన అవకాశాలు రాలేదు. తన కెరీర్లో ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళ చిత్రాల్లో కూడా నటించింది. తమిళ్, కన్నడలో ఆమె వరుస సినిమాలు చేసింది. ఏమైందో కానీ సడన్ గా సినిమాలకు ఆమె గుడ్ బై చెప్పింది. 

అయితే, సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులతో టచ్ లోనే ఉంది. తాజాగా దీపావళి సందర్భంగా ఆమె ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాను ఒక విదేశీయుడుతో ప్రేమలో ఉన్నానని... త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నానని తెలిపింది. అంతేకాదు... తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేసింది. ఆయనతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. 

  • Loading...

More Telugu News