ఇట్స్ అన్ స్టాపబుల్... చంద్రబాబు, పవన్ భేటీపై టీడీపీ నేత జీవీ రెడ్డి కామెంట్
Add ap7am to your home Screen

ఇట్స్ అన్ స్టాపబుల్... చంద్రబాబు, పవన్ భేటీపై టీడీపీ నేత జీవీ రెడ్డి కామెంట్

tdp leader gv reddy interesting comment on chandrababu and pawan kalyan meeting
  • పవన్ కల్యాణ్ తో భేటీ అయిన చంద్రబాబు
  • భేటీపై హర్షం వ్యక్తం చేస్తున్న టీడీపీ, జనసేన శ్రేణులు
  • ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమేనంటూ టీడీపీ నేత జీవీ రెడ్డి వ్యాఖ్య
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. అధికార వైసీపీ ఈ భేటీపై విమర్శలు గుప్పిస్తుండగా... టీడీపీ, జనసేన శ్రేణులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ప్రకటన వెలువడకపోయినా... 2024 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల భేటీపై టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజాస్వామ్య వాదులంతా కలిసి రావాలి. ఈ రోజు జనసేన మరియు తెలుగుదేశం కలయిక అందులో ఓ భాగం. ఇట్స్ అన్ స్టాపబుల్ అంటూ ఆయన కామెంట్ చేశారు.
TDP
Chandrababu
Janasena
Pawan Kalyan
GV Reddy

More Telugu News