Aha: 3 గంట‌ల్లోనే 11 ల‌క్ష‌ల వ్యూస్‌... దూసుకుపోతున్న బాల‌య్య‌, చంద్ర‌బాబు 'అన్‌స్టాప‌బుల్ 2' ప్రోమో

  • 'అన్‌స్టాప‌బుల్ 2' తొలి ఎపిసోడ్ ప్రోమోను విడుద‌ల చేసిన 'ఆహా'
  • ఈ ఎపిసోడ్‌కు అతిథులుగా హాజ‌రైన‌ చంద్ర‌బాబు, నారా లోకేశ్
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ప్రోమో వీడియో
unstoppable 2 first episode promo goes vral on social media

ఆహా ఓటీటీలో నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా ప్ర‌సారం కానున్న 'అన్‌స్టాప‌బు‌ల్ సీజ‌న్ 2' తొలి ఎపిసోడ్‌లో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు నారా లోకేశ్ అతిథులుగా పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా... మంగ‌ళ‌వారం సాయంత్రం ఈ ఎపిసోడ్ ప్రోమో విడుద‌లైంది.

సోష‌ల్ మీడియాలో ఈ ప్రోమో వైర‌ల్‌గా మారింది. కేవ‌లం 170 నిమిషాల్లో (దాదాపుగా 3 గంట‌లు) ఈ వీడియోకు ఏకంగా 11 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. టీడీపీకి ఎదురైన క్లిష్ట ప‌రిస్థితుల‌తో పాటు చంద్ర‌బాబు జీవితంలో చోటుచేసుకున్న స‌ర‌దా ఘ‌ట‌న‌లు, బాల‌య్య వెల్ల‌డించిన ఆస‌క్తిక‌ర అంశాలు, త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంపై లోకేశ్ చేసిన కామెంట్ల‌తో కూడిన ఈ ప్రోమో సోష‌ల్ మీడియాలో దూసుకుపోతోంది.

More Telugu News