పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య కేసు నిందితుడు
- పంజాబ్ మన్సా జిల్లా పోలీసుల కళ్లు గప్పి పారిపోయిన దీపక్ టిను
- గోయింద్వాల్ జైలు నుంచి తీసుకొస్తుండగా శనివారం రాత్రి ఘటన
- పట్టుకునేందుకు గాలిస్తున్నట్టు పోలీసుల ప్రకటన
మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలాగా ప్రసిద్ధి చెందిన శుభదీప్ సింగ్ సిద్ధూ ను దుండగులు కాల్చి చంపారు. తన స్నేహితుడు, బంధువుతో కలిసి జీపులో మాన్సాలోని జవహర్ కే గ్రామానికి వెళ్తుండగా హత్యకు గురయ్యాడు. అతని వాహనాన్ని దారి మళ్లించి ఆరుగురు షూటర్లు బుల్లెట్ల వర్షం కురిపించడంతో మూసేవాల అక్కడిక్కడే చనిపోయాడు. ఈ హత్య తామే చేసినట్టు లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు గోల్డీ బ్రార్ ప్రకటించాడు. ఈ కేసులో ఛార్జ్ షీట్ వేసిన 24 మంది నిందితుల్లో టినూ కూడా ఉన్నాడు.