రేపే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం... హైదరాబాద్‌లో పోస్టర్ ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
- కన్యాకుమారి నుంచి యాత్రను ప్రారంభించనున్న రాహుల్ గాంధీ
- పోస్టర్‌ను రూపొందించిన యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐలు
- గాంధీ భవన్‌లో పోస్టర్‌ను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) మంగళవారం రాహుల్ యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌లో ఈ పోస్టర్లను ఆవిష్కరించారు. యువజన కాంగ్రెస్, పార్టీ విద్యార్ధి విభాగం ఎన్ఎస్‌యూఐలు ఈ పోస్టర్లను రూపొందించాయి.