రాహుల్ గాంధీతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ భేటీ
- ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నితీశ్ కుమార్
- రాహుల్ గాంధీతో జాతీయ రాజకీయాలపై చర్చ
- భారత్ జోడో యాత్రపైనా నేతల మధ్య చర్చ
2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ఎల్లుండి (సెప్టెంబర్ 7) నుంచి భారత్ జోడో యాత్ర పేరిట కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకు ముందు రాహుల్‌తో నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ సుదీర్ఘ పాదయాత్రపైనా చర్చ జరిగినట్లు సమాచారం.