TTD: చెన్నై నుంచి తిరుమలకు వచ్చే శ్రీవారి గొడుగుల ఊరేగింపులో భక్తులు కానుకలు ఇవ్వొద్దు... వాటితో మాకు సంబంధంలేదు: టీటీడీ

TTD warns devotees do not give offerings during umbrellas rally
షార్ట్స్‌లో చూడండి
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గరుడసేవ కోసం ప్రత్యేకంగా చెన్నై నుంచి గొడుగులు తీసుకురావడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. పలు హిందూ ధార్మిక సంస్థలు ఈ ఊరేగింపులో పాలుపంచుకుంటాయి. అయితే, గరుడసేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమల చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు ఇవ్వొద్దని టీటీడీ స్పష్టం చేసింది. 

భక్తులు ఇచ్చే కానుకలు టీటీడీకి చేరవని, ఆ కానుకలతో తమకు సంబంధంలేదని తెలిపింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు జరగనున్నాయి.
Go Back to Shorts
TTD
Umbrellas Rallly
Garuda Seva
Offerings
Devotees
Tirumala
Brahmotsavam

More Telugu News