Asia Cup: ఆసియా క‌ప్‌: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక‌

  • గ్రూప్ బీలో బంగ్లాదేశ్‌, శ్రీలంక‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌
  • ఇప్ప‌టికే ఆఫ్ఘ‌న్ చేతిలో ఓడిన ఇరు జ‌ట్లు
  • టాస్ గెలిచి బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన లంక జ‌ట్టు
srilanka wins the toss and elected to bowl first

దుబాయి వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్‌లో భాగంగా గురువారం బంగ్లాదేశ్ జ‌ట్టుతో శ్రీలంక త‌ల‌ప‌డ‌నుంది. ఈ రాత్రి 7.30 గంట‌ల‌కు దుబాయి ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియంలో మొద‌లు కానున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక జ‌ట్టు తొలుత బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. బంగ్లాదేశ్ జ‌ట్టును ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

గ్రూప్ బీలో ఉన్న ఈ రెండు జ‌ట్లు ఇప్ప‌టిదాకా ఒక్కో మ్యాచ్ ఆడగా... ఆ మ్యాచ్‌లలో ఇరు జ‌ట్లు ఓట‌మిపాల‌య్యాయి. గ్రూప్ బీలోని మ‌రో జ‌ట్టు ఆఫ్ఘ‌నిస్థాన్‌తో ఈ రెండు జ‌ట్లు ఇప్ప‌టికే త‌మ మ్యాచ్‌ల‌ను ఆడేశాయి. ఆఫ్ఘ‌న్ చేతిలో ఇరు జ‌ట్లు ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్నాయి. వెర‌సి ఈ రెండు జ‌ట్ల‌కు నేటి మ్యాచ్ అత్యంత కీల‌కంగా మారింది.

More Telugu News