మల్టీ స్టారర్ మూవీని డైరెక్ట్ చేయాలనుంది .. హీరోలు ఆ ఇద్దరే: వైష్ణవ్ తేజ్

Ranga Ranga Vaibhavanga Team Interview
  • వైష్ణవ్ - కేతిక జంటగా రూపొందిన 'రంగ రంగ వైభవంగా'
  • సెప్టెంబర్ 2వ తేదీన విడుదలవుతున్న సినిమా
  • ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో నడిచే కథ  
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్
వైష్ణవ్ తేజ్ - కేతిక శర్మ జంటగా 'రంగ రంగ వైభవంగా' సినిమా రూపొందింది. వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా, హీరో హీరోయిన్లను దర్శకుడు బుచ్చిబాబు ఇంటర్వ్యూ చేశాడు. మల్టీ స్టారర్ మూవీని ఎవరితో చేయడానికి ఇష్టపడతావ్? అనే ప్రశ్న వైష్ణవ్ తేజ్ కి ఎదురైంది. 

అందుకు ఆయన స్పందిస్తూ .. "మల్టీ స్టారర్ లో నేను ఒక ఆర్టిస్టుగా చేయాలనుకోవడం లేదు. మల్టీ స్టారర్ సినిమాను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. మా అన్నయ్య సాయితేజ్ .. మా బావ వరుణ్ తేజ్ తో మల్టీ స్టారర్ చేయాలనుంది. ఆల్రెడీ కథను కూడా రెడీ చేసుకున్నాను" అన్నాడు.  

నేను అనుకున్న మల్టీ స్టారర్ ను ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? అనే విషయంలో ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. త్వరలోనే అందుకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తాను" అని చెప్పాడు. ఈ శుక్రవారం దాదాపు అరడజను సినిమాల మధ్యలో రిలీజ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందన్నది చూడాలి.
Go Back to Shorts
Panja Vaisshnav Tej
Kethika Sharma
Ranga Ranga Vaibhavanga Movie

More Telugu News