రాజాసింగ్ జైలుకు వెళ్లాల్సిందే: ఒవైసీ
- మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వ్యాఖ్యలు
- స్పందించిన ఎంఐఎం అధినేత
- ప్రవక్త ముస్లింల హృదయాల్లో ఉన్నాడని వెల్లడి
- రాజాసింగ్ ను కస్టడీలోకి తీసుకోవాలన్న ఒవైసీ
- అప్పటివరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టీకరణ
అతడిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, అతడు జైలుకు వెళ్లాల్సిందేనని ఉద్ఘాటించారు. రాజాసింగ్ ను పోలీస్ కస్టడీకి పంపి, అతడి వాయిస్ శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్ష చేయించాలని తెలిపారు. అతడి చెత్తవాగుడుకు ఇదే ఆఖరు కావాలని అన్నారు.
అటు, ఎంఐఎం పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ రాసింది. దైవదూషణ చేసిన గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ ను అసెంబ్లీ నుంచి తొలగించాలని కోరింది. అతడు ఎంతమాత్రం శాసనసభ్యుడిగా కొనసాగజాలడని ఎంఐఎం పేర్కొంది.