పోలీసు యూనిఫాంలో మునావర్ షోకు వచ్చిన బీజేపీ కార్యకర్త... పట్టుకుని చితకబాదిన పోలీసులు
- శిల్పకళా వేదికలో మునావర్ షో
- బీజేపీ బెదిరింపులతో భారీ బందోబస్తు
- ఖాకీ దుస్తుల్లో వచ్చిన బీజేపీ కార్యకర్త
- గుర్తించి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
మునావర్ ఫారూఖీ షోను అడ్డుకుంటామని బీజేపీ శ్రేణులు, ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శిల్పకళా వేదిక వద్ద వేలాది సంఖ్యలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఎలాగైనా ఫారూఖీ షోకు హాజరై... ఆతడేమాత్రం మాట తప్పినా దాడి చేయాలన్న సంకల్పంతో సాగిన ఓ బీజేపీ కార్యకర్త పోలీసులకు దొరికిపోయాడు. పోలీసుల కళ్లుగప్పేందుకు పోలీసు యూనీఫాంలోనే శిల్పకళా వేదిక వద్దకు వెళ్లిన అతడిని లోపలికి ప్రవేశించకుండానే పోలీసులు గుర్తించారు. దీంతో వెనువెంటనే అతడిని పట్టుకున్న పోలీసులు అక్కడే లాఠీలతో చితక్కొట్టారు. అనంతరం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.