ఎవరెస్ట్ మంచుకు కొత్త ప్రమాదం.. షాకింగ్ విషయాలు వెల్లడించిన అధ్యయనం
- ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కార్యకలాపాలతో మంచు కరుగుదల
- 2023లో 8.49 లక్షల మెగాజౌళ్ల వేడి విడుదల
- ఈ వేడి 2,492 టన్నుల మంచును కరిగించగలదు
- మూత్ర విసర్జనతో వెలువడే వేడినీ అధ్యయనంలో లెక్కింపు
- 32 ఏళ్లలో బేస్ క్యాంప్ ఉష్ణోగ్రత 0.28 డిగ్రీల సెల్సియస్ చొప్పున పెరిగింది
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం వద్ద మరో ఆందోళనకర విషయం బయటపడింది. బేస్ క్యాంప్‌లో పెరుగుతున్న మానవ కార్యకలాపాలు ఖుంబు హిమానీనదం కరుగుదలను మరింత పెంచుతున్నాయని తాజా అధ్యయనం తెలిపింది. వాతావరణ మార్పులతో పాటు ఇంధన వినియోగం, మనుషుల మూత్ర విసర్జనతో విడుదలయ్యే వేడి కూడా దీనికి కారణమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ప్రతి క్లైంబింగ్ సీజన్‌లో వేలాది మంది పర్వతారోహకులు, పర్యాటకులు, గైడ్లు, సిబ్బందితో సందడిగా మారుతుంది. వంట, విద్యుత్, వేడి కోసం ఎల్పీజీ, కిరోసిన్, పెట్రోల్ వాడుతున్నారు. వీటి నుంచి భారీగా వేడి విడుదలవుతోంది. మనుషుల మూత్ర విసర్జనను కూడా పరిశోధకులు లెక్కల్లోకి తీసుకున్నారు.
2023 వసంతకాలంలో బేస్ క్యాంప్‌లో విడుదలైన మొత్తం వేడి 8,49,174 మెగాజౌళ్లుగా అంచనా వేశారు. ఈ వేడి దాదాపు 2,492 టన్నుల మంచును కరిగించగలదని అధ్యయనం వెల్లడించింది.
1991 నుంచి 2023 వరకు ల్యాండ్సాట్ ఉపగ్రహ సమాచారాన్ని పరిశీలించగా బేస్ క్యాంప్ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఏటా 0.28 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు తేలింది. ఖుంబు హిమానీనదంతో పోలిస్తే ఇక్కడ వేడెక్కుతున్న వేగం దాదాపు రెండింతలుగా ఉంది.
ప్రస్తుతం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ హిమానీనదంపైనే ఉంది. పరిస్థితులు మరింత దిగజారితే క్యాంప్‌ను తరలించాల్సి రావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుత క్యాంప్‌కు నైరుతి దిశలో స్థిరమైన నేలపై రెండు ప్రత్యామ్నాయ ప్రాంతాలను కూడా గుర్తించారు.