త్వరలోనే మాధవ్ వీడియోపై పూర్తి నివేదికను ప్రజల ముందు ఉంచుతాం: టీడీపీ నేత పట్టాభి
- ఎంపీ మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారం
- ప్రెస్ మీట్ పెట్టిన ఏపీ సీఐడీ చీఫ్
- స్టాఫోర్డ్ రిపోర్టు వందశాతం వాస్తవం అన్న పట్టాభి
- నిజాలను కప్పిపుచ్చడం మానుకోవాలని హితవు
నిజం నిప్పులాంటిదని, ఎవరూ కప్పిపుచ్చలేరని ఉద్ఘాటించారు. డర్టీ పిక్చర్ ఎంపీని వెనుకేసుకురావడం సిగ్గుచేటని అన్నారు. మహిళలపై అత్యాచారాలను పట్టించుకోని సీఐడీ ఇప్పుడు తమను బెదిరిస్తోందని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాల పరిశోధనలతో కూడిన ఫోరెన్సిక్ నివేదిక తెస్తే, తమపైనే కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే నివేదిక పూర్తి వివరాలు ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు.
టీడీపీ నేతలకు తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిజాలను కప్పిపుచ్చుకునే కార్యక్రమాలను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. మాధవ్ బూతు వీడియోను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని పట్టాభి డిమాండ్ చేశారు.