మహిళా క్రికెటర్లకు శుభవార్త చెప్పిన ఐసీసీ.. అంతర్జాతీయ మ్యాచ్ ల ఖరారు
- రాబోయే మూడేళ్లకు 310 మ్యాచ్ ల షెడ్యూల్
- 65 మ్యాచ్ లు ఆడనున్న భారత జట్టు
- వన్డేలు, టీ20లకు ఎక్కువ ప్రాధాన్యత
ఇందులో చాలా మ్యాచ్ లను భారత జట్టుకు కేటాయించింది. ఈ మూడేళ్లలో భారత మహిళల జట్టు 65 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో రెండు టెస్ట్‌లు, 27 వన్డేలు, 36 టీ20 మ్యాచ్ లు ఉన్నాయి. భారత్.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో ఒక్కో టెస్ట్ మ్యాచ్ లో పోటీ పడనుంది. వన్డేలు, టీ20లు కూడా ఎక్కువగా ఈ రెండు జట్లతోనే ఉన్నాయి. మే నెలలోనే అమల్లోకి వచ్చిన ఈ ఎఫ్‌టీపీలో భారత్ ప్రస్తుతానికి 3 వన్డేలు, 3 టీ20లు పూర్తి చేసింది. ఎఫ్‌టీపీ ప్రకారం భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్‌తో తలపడనుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ లో పర్యటించనుంది.