నంద్యాలలో హత్యకు గురైన కానిస్టేబుల్ కుటుంబానికి టీడీపీ నేతల పరామర్శ
- 2 రోజుల క్రితం హత్యకు గురైన కానిస్టేబుల్ సురేంద్ర
- పట్టణంలోనే దాడి చేసి హత్య చేసిన రౌడీ మూకలు
- రాష్ట్రంలో సామాన్యుల మాన, ప్రాణాలకు రక్షణ లేదన్న టీడీపీ నేతలు
ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో పోలీసుల ప్రాణాలకే భద్రత లేకుండా పోయిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్న పోలీసులకే భద్రత లేకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సామాన్యుల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆరోపించారు.