రష్యన్‌ అబ్బాయి.. ఉక్రెయిన్‌ అమ్మాయి.. అక్కడ వార్‌, ఇక్కడ ప్యార్‌! పెళ్లి వీడియో ఇదిగో..

Russian man marries ukrainian woman in india
  • ఓవైపు ఉప్పూ, నిప్పులా రష్యా, ఉక్రెయిన్..
  • ఇండియాలో వివాహం చేసుకున్న ఆ దేశాల వధూవరులు
  • హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో వివాహం 
  • హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగిన తీరు
కొన్నేళ్లుగా ఉక్రెయిన్, రష్యా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఆరు నెలల క్రితం రష్యా దాడులు, ఉక్రెయిన్ ప్రతి దాడులతో మొదలైన యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. రష్యా, ఉక్రెయిన్ ఇలా వార్ లో ఉండగానే.. ఆ దేశాలకు చెందిన యువకుడు, యువతి మాత్రం ప్రేమలో పడ్డారు. విద్వేషాలకు ప్రేమ అతీతమంటూ రష్యాకు చెందిన అబ్బాయి, ఉక్రెయిన్ కు చెందిన అమ్మాయి పెళ్లితో ఒక్కటయ్యారు. అది కూడా మన దేశంలో, హిందూ సంప్రదాయ పద్ధతిలో వారు పెళ్లి చేసుకోవడం ఆసక్తికరం. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.

ఇక్కడి వాళ్లే సొంత వారై..
రష్యాకు చెందిన సెర్జెయ్‌ నొవికోవ్‌, ఉక్రెయిన్ కు చెందిన ఎలోనా బ్రమొకా ఇద్దరూ ఉద్యోగాల నిమిత్తం కొన్నాళ్లు ఇజ్రాయెల్ లో ఉన్నారు. ఆ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇటీవలే వారు హిమాచల్‌ప్రదేశ్‌ లోని ధర్మశాలకు వచ్చారు. కొంతకాలం నుంచి అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. స్థానికులు ధర్మశాలకు సమీపంలోని ఖరోటా దివ్య ఆశ్రమంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వారి వివాహం జరిపించారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. ఈ వివాహానికి వధూవరుల విదేశీ స్నేహితులు కూడా హాజరై ఆశీర్వదించారు.

 
  
  
Go Back to Shorts
Russian marries ukrainian woman
Russia
Ukraine
India
Marriage
Offbeat
International

More Telugu News