Gorantla Madhav: ఇదంతా నాపై చేస్తున్న కుట్ర: న్యూడ్ వీడియో కాల్ వివాదం పై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందన

  • మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడారంటూ మాధవ్ పై వార్తలు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • ఇది మార్ఫింగ్ వీడియో అన్న మాధవ్
It is morphed video says Gorantla Madhav responding to nude video call

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారంటూ కొన్ని టీవీ చానెళ్లలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన ఒక మహిళతో మాట్లాడుతున్నట్టున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ స్పందిస్తూ... ఈ వీడియో వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ఇది మార్ఫింగ్ వీడియో అని అన్నారు. ఈ వీడియో తొలుత ఏబీఎన్ లో ప్రసారమయిందని చెప్పారు. 

దీని వెనుక టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ తదితరులు ఉన్నారని అన్నారు. టీడీపీ నేతలకు దమ్ముంటే తనను నేరుగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఇప్పటికే ఈ విషయంపై జిల్లా ఎస్పీకి తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ వీడియోను ఫోరెన్సిక్ టెస్టుకు పంపాలని అన్నారు. తాను ఏ విచారణకైనా సిద్ధమేనని చెప్పారు. ఈ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ వీడియోలో ఉన్నది తానే అని నిరూపిస్తే తన తల నరుక్కుని ఏబీఎన్ రాధాకృష్ణ కాళ్ల దగ్గర పెడతానని చెప్పారు.

More Telugu News