Nikhil: ఈ నెల 6న 'కార్తికేయ 2' ట్రైలర్ రిలీజ్

  • సీక్వెల్ గా పలకరించనున్న'కార్తికేయ 2'
  • నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ 
  • ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల
Karthikeya 2 movie update

నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2' సినిమా రూపొందింది. అభిషేక్ అగర్వాల్ .. విశ్వప్రసాద్ .. వివేక్ కూచిభొట్ల కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. 

ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ద్వాపర యుగానికి సంబంధించిన ఒక రహస్యాన్ని ఛేదించడానికి హీరో పూనుకోవడమే ఈ సినిమా కథ. 

ఈ కథ మొదటి నుంచి చివరివరకూ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుందనీ, తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోతుందని నిఖిల్ చెప్పాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అనుపమ్ ఖేర్ కీలకమైన పాత్రను పోషించారు. కాలభైరవ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.

More Telugu News