తెలంగాణలో తాజాగా 851 మందికి కరోనా
- గత 24 గంటల్లో 38,024 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 327 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 652 మంది
- ఇంకా 5,369 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,19,141 మంది కరోనా బారినపడగా, వారిలో 8,09,661 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,369 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
