తెలంగాణలో కొత్తగా 652 మందికి కరోనా
- గత 24 గంటల్లో 33,017 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 297 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 627 మంది
- ఇంకా 4,711 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 8,13,772 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,04,950 మంది ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 4,711 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
