లార్డ్స్ వేదికగా మరో అరుదైన చిత్రం!... ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్లు!
- లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా రెండో వన్డే
- స్వయంగా స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్ వీక్షించిన సచిన్
- సర్ గ్యారీ సోబర్స్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్న వైనం
తాజాగా లార్డ్స్ వేదికగానే నిన్నటి మరో అరుదైన సన్నివేశాన్ని సచిన్ స్వయంగా వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌కు ఏ పాటి పేరుందో.. అదే మాదిరి గుర్తింపును అంతకంటే ముందుగానే సంపాదించుకున్న దిగ్గజ క్రికెటర్ సర్ గ్యారీ సోబర్స్‌తో కలిసి లార్డ్స్‌లో సచిన్ ఓ ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటోను శుక్రవారం మధ్యాహ్నం సచిన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. లార్డ్స్‌లో మ్యాచ్‌ను చూడటంతో పాటు ఆటలో వన్ అండ్ ఓన్లీగా నిలిచిన సర్ గ్యారీని కూడా కలిశానంటూ సచిన్ ఆ ఫొటోకు కామెంట్ జత చేశాడు.